Kapil Dev on lack of all-rounders in India
#KapilDev
#Teamindia
#Indiancricketteam
#ViratKohli
ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమికి ప్రధాన కారణం పేస్ ఆల్‌రౌండర్ లేకపోవడం. చాలా మంది క్రికెట్ విశ్లేషకులు, మాజీ క్రికెటర్లతో సహా క్రికెట్‌పై అవగాహన ఉన్న ప్రతీ ఒక్కరు చెప్పే మాట ఇది. అవును పేస్ బౌలింగ్‌కు అనుకూలించే సౌతాంప్టన్ పిచ్‌పై భారత్ ఇద్దరు స్పిన్ ఆల్‌రౌండర్లతో బరిలోకి దిగడం, పేస్ ఆల్‌రౌండర్ లేకపోవడం కోహ్లీసేన కొంపముంచింది. పేస్ ఆల్‌రౌండర్లతో మొత్తం ఐదుగురు పేసర్లతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ అసాధారణ ప్రదర్శనతో 8 వికెట్లతో కోహ్లీసేనను చిత్తు చేసి విశ్వవిజేతగా నిలిచింది